రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

24 Feb, 2016 10:49 IST|Sakshi
పాణ్యం: కర్నూలు జిల్లా పాణ్యం మండలం ఆర్‌జీఎం కళాశాల వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి, యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ పై కళాశాలకు వెళుతున్న నాగస్వర్ణ అనే యువతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా