సీఎం చిత్రపటం.. ఇంట్లో పెట్టుకుంటాం

7 Mar, 2020 08:19 IST|Sakshi
మోహితకు చెక్‌తో పాటు సీఎం చిత్రపటాన్ని అందిస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌

దువ్వాడతో చిన్నారి మోహిత 

పదేళ్ల క్రితం వినికిడి సమస్యకు సాయం చేసిన వైఎస్సార్‌ 

నేడు సాయం కొనసాగించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 

మోహిత ఆపరేషన్‌ కు రూ.2 లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ 

టెక్కలి రూరల్‌: చిన్నారి మోహిత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాన్ని తనకు ఇవ్వాలని, తన ఇంట్లో పెట్టుకుంటానని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ను అడిగింది. దీంతో ఆమెకు సీఎం చిత్రపటాన్ని దువ్వాడ అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుమారు 10 సంవత్సరాల క్రితం కోటబోమ్మాళి గ్రామానికి చెందిన సకలబర్తుల త్రినాథరావు కుమార్తె మోహితకు రెండు చెవులు వినిపించక ఇబ్బంది పడుతున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కలసి తమ సమస్యను వివరించారు. (టీడీపీ నేత కుమార్తెకు జగన్‌ సాయం)

దానిపై స్పందించిన ఆయన మోహితకు ఆ్రస్టేలియా డాక్టర్లతో వైద్యం చేయించి వినిపించేందుకు వీలుగా చెవిలో మిషన్‌ ఏర్పాటు చేశారు. అలాగే వెలుపల వైపు మరో మిషన్‌ ఏర్పాటు చేశారు. అయితే వెలుపలి వైపు ఏర్పాటు చేసిన మిషన్‌ 10 సంవత్సరాలే పనిచేస్తుందని చెప్పారు. దీంతో గతేడాది నవంబర్‌ 23వ తేదీన మిషన్‌ పని చేయడం ఆగిపోయింది. మరలా ఆ అమ్మాయికి అదే సమస్య వచ్చింది.

దువ్వాడ చొరవతో మరలా సాయం 
ప్రస్తుతం మోహిత 9వ తరగతి చదువుతోంది. మరలా ఆ పాపకు సక్రమంగా వినిపించాలంటే మిషన్‌ ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పాన్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న త్రినాథరావు అంత డబ్బు లేకపోవడంతో కుమిలిపోయాడు. ఆ సమయంలో కొంతమంది స్నేహితుల సాయంతో వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ వద్దకు వెళ్లారు. (ఎనిమిది నెలల చిన్నారి వైద్యానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌)

అనంతరం దువ్వాడతో జరిగిన విషయం అంతా వివరించడంతో ఆయన చలించిపోయారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.2 లక్షలు విడుదల చేశారు. దీంతో బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్‌ను పార్టీ కార్యాలయంలో దువ్వాడ శ్రీనివాస్‌ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కుమార్తెను దేవుళ్లులా ఆదుకున్నారన్నారు. కార్యక్రమంలో పొన్నాన జగన్మోహన్‌రావు(చంటి), కిల్లి అజయ్‌కుమార్, బెండి ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు