ఏపీఎస్‌ ఆర్టీసీకి ఆదరణ

13 Jul, 2020 05:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వేళ.. ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల ఆదరణ చూరగొంటోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటకలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీలోనే రోజు వారీ 2 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్ధానాలకు చేరుకుంటున్నారు. మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీఎస్‌ఆర్టీసీ.. ఏపీఎస్‌ఆర్టీసీ కంటే వారం ముందుగానే సర్వీసుల్ని తిప్పుతోంది. తమిళనాడులో ఆర్టీసీ ఆపరేషన్స్‌ ఇంకా ప్రారంభం కాలేదు.  

► దూర ప్రాంత సర్వీసుల్లో ఏపీఎస్‌ఆర్టీసీలో దాదాపు 60 వేల టికెట్లు,  తెలంగాణ ఆర్టీసీలో 1,492, కర్ణాటక ఆర్టీసీలో 4,843 టికెట్ల బుకింగ్‌ జరుగుతోంది.  
► తెలంగాణ ఆర్టీసీతో ఇంకా చర్చలు కొలిక్కి రాకపోవడంతో హైదరాబాద్‌కు ఏపీఎస్‌ఆర్టీసీ రాకపోకలు ప్రారంభించలేదు.  కర్నాటక రాష్ట్రానికి గత నెల 17 నుంచి బస్సుల్ని తిప్పుతోంది.  
► ఏపీఎస్‌ఆర్టీసీలో 76 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. అదే తెలంగాణలో 20 శాతం ఆక్యుపెన్సీ దాటడం లేదు.  
► ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కోవిడ్‌ వ్యాప్తి అతి తక్కువగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్స్‌ పేర్కొంది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందని తేల్చింది.  
► ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లోనూ ఇతర ఆర్టీసీల కంటే ఏపీఎస్‌ఆర్టీసీ మెరుగ్గా ఉంది.   

మరిన్ని వార్తలు