200 ఇయర్స్‌ ఇండస్‌'ట్రీ'

4 Nov, 2017 12:12 IST|Sakshi

వజ్రపుకొత్తూరు:   ఊడల మర్రి. ఈ పేరు వింటే విఠలాచార్య సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ఉద్దానం రామకృష్ణాపురంలో ఓ వృక్షం రెండు వందల ఏళ్లుగా స్థా నికులకు నీడనిస్తోంది. ఈ మర్రి నీడన రామచండేశ్వరి అమ్మవారు కొలువై ఉండడంతో ఇక్కడ ప్రతి ఐదేళ్లకోమారు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ చెట్టు కడ, మొదలు గుర్తు పట్టడం ఇప్పటి వరకు ఎవరి తరం కాలేదు. మర్రి ఊడలు శాఖోపశాఖ లుగా వ్యాపించడంతో కడేదో మొదలేదో తెలీదు. ప్రస్తుతం ఉన్న గ్రామం అప్పట్లో సముద్ర తీరా నికి 250 మీటర్లు తూర్పుగా ఉండేది. ఇసుక దిబ్బలు ఎత్తుగా వచ్చి పడడంతో 115 ఏళ్ల క్రితం గ్రామస్తులంతా తీరానికి దూరంగా పల్లెను నిర్మించుకుని సమీపంలో ఉన్న రామచండేశ్వరి అమ్మవారుకు పూజలు చేసేవారు.

అప్పటికే మర్రి చె ట్టుకు 100 ఏళ్లని తన తాతలు ముత్తాతలు చెప్పే వారని గ్రామ మాజీ సర్పంచ్‌ చింత జనార్దనరావు చెప్పారు. అప్పట్లో మర్రి చెట్లుకు మహిమలు ఉండేవని, ఎవరైనా పూజ కోసం మర్రి కొమ్మలు కోస్తే పాలుకు బదులు ఎర్రని ద్రవం కారేదని చెప్పారు. దీంతో అప్పటి నుంచి కొమ్మలు ఎవరూ కోయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నామని తెలిపారు.  

కార్తీక మాసంలో సందడి
కార్తీక మాసంలో ఇక్కడ వన భోజనాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. దీంతో ఇక్కడ పరిసర గ్రామాల విద్యార్థులు, ఇతర గ్రామ పర్యాటకులు వచ్చి విడిదిచేస్తారు.  అందులో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎక్కువగా ఉంటారని సర్పంచ్‌ చింత రజినీ నారాయణమూర్తి చెప్పారు. 

మరిన్ని వార్తలు