పిఠాపురంలో టీడీపీకి షాక్‌

5 Dec, 2019 08:05 IST|Sakshi
టీడీపీ మహిళా నాయకురాలిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే దొరబాబు

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి 

200 మంది మహిళా కార్యకర్తలు చేరిక

పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొరబాబు

పిఠాపురం: తమకు కంచుకోటగా చెప్పుకునే పిఠాపురంలో టీడీపీ నేతలకు పట్టణ మహిళలు షాకిచ్చారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సుమారు 200 మంది మహిళా నాయకులు, కార్యకర్తలు టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పిఠాపురం మూడవ వార్డుకు చెందిన కె.నాగలక్ష్మి, అరుణశ్రీ ఆధ్వర్యంలో బుధవారం సుమారు 200 మంది మహిళా కార్యకర్తలు నాయకులు టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుంటారని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కొనసాగిస్తున్నారన్నారు.

మహిళలను అన్ని విధాలా ఆదుకోడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే మహిళలు అధిక శాతం మంది వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం గతంలో మహిళలను నమ్మించి నట్టేటముంచిదని డ్వాక్రా మహిళలను అప్పుల పాలు చేసిందని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో మహిళలందరికీ అన్ని వేళలా తాను అండగా ఉంటానని పథకాలు మహిళలకు ఎటువంటి పైరవీలు లేకుండా అందజేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు బాలిపల్లి రాంబాబు పలువురు మహిళలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన మహిళలు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సత్కరించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా కట్టడిలో ఏపీ ముందంజ

'కరోనా' మాటున హ్యాకింగ్‌ 'కాటు'

సీఎం సహాయ నిధికి పలువురి విరాళాలు

ఆసుపత్రులకు నిరంతర విద్యుత్తు

ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావద్దు

సినిమా

అర్జున్‌.. అను వచ్చేశారు

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది