2015 డైరీల ఆవిష్కరణ

2 Jan, 2015 02:58 IST|Sakshi
2015 డైరీల ఆవిష్కరణ

విజయనగరం అర్బన్: విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి వార్షిక క్యాలెండర్, డైరీలను రూపొందించుకొని ఉపాధ్యాయులు అమలు చేయాలని కేంద్రమం త్రి పి.అశోక్‌గజపతిరాజు కోరారు. యూటీఎఫ్ జిల్లా కమిటీ గురువారం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఈ సంఘం రూపొం దించిన క్యాలెండర్, డైరీ-2015లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, కలెక్టర్ ఎంఎంనాయక్, జేసీ రామారావు, ఆర్డీఓ ఎం.వెంకటరావు, యూటీఎఫ్ నాయకులు డి.రాము, కె.శేషగిరి, అల్లూరి శివవర్మ, సీహెచ్‌కృష్ణంనాయుడు, వర్రి రమేష్, నవుడు సత్యన్నారాయణ, సిహెచ్‌మహేష్, వి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
 
 పీఆర్‌టీయూ డైరీ-2015 విడుదల...
 పీఆర్‌టియూ జిల్లా కమిటీ రూపొందించిన క్యాలెం డర్, డైరీ-2015ని గురువారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ జి.కృష్ణారావు విడుదల చేశా రు. విద్యాభివృద్ధితోపాటు ఉపాధ్యాయుల సంక్షేమా న్ని ఏడాది పాటు చూసుకోవడానికి ప్రణాళికలు వేసుకోవాలని డీఈఓ కృష్ణారావు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ టీకేవీ సత్యన్నారాయణ, సంఘం జిల్లా అధ్యక్షుడు వి.తవిటినాయుడు, ప్రధాన కార్యదర్శి గోపాలపట్నాయక్, ప్రచార కార్యదర్శి బంకపల్లి శివప్రసాద్ పాల్గొన్నారు.
 
 ఎస్సీ,ఎస్టీ టీచర్ల సంఘం క్యాలెండర్-2015 ఆవిష్కరణ
 ఎస్సీ, ఎస్టీ టీచర్ల సంఘం రాష్ట్ర కమిటీ రూపొందించిన క్యాలెండర్-2015ను గురువారం స్థానిక బాలాజీలోని అంబేద్కర్ సమావేశ మందిరంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సామల సింహాచలం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ ఉద్యమ కార్యక్రమాల రూపకల్పనపై సమీక్షించారు. విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుని సమస్యల సాధన వంటి కార్యక్రమాలపై ప్రత్యేక ప్రణాళికలు వేసుకుని కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డూరి పైడితల్లి, ప్రధాన కార్యదర్శి పి.దేవానంద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాములు, రమేష్, చింతాడ చిరంజీవులు, ఎం.రామారావు, కిషోర్, ఎన్.ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు.
 
 ఏపీటీఎఫ్ క్యాలెండర్-2015 విడుదల
 ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ రూపొందించిన క్యాలెండర్-2015ను గురువారం కలెక్టర్ ఎం.ఎంనాయక్ విడుదల చేశారు.
 కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.సదాశివరావు, జిల్లా అధ్యక్షులు ఐ.అప్పారావు, జిల్లా ప్రధా న కార్యదరి జెసీరాజు, రాష్ట్ర కార్యదర్శి మోహనరావు, గౌరవఅధ్యక్షులు ఫకీరునాయుడు, మూర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు