విద్యుత్ ఉద్యోగులకు 22 శాతం ఫిట్‌మెంట్!

4 May, 2014 02:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 22 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసింది. శనివారం విద్యుత్‌సౌధలో విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై యాజమాన్యానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య చర్చలు జరిగాయి. తమకు 36 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ కావాలని ఉద్యోగ సంఘాలు పట్టుపట్టాయి. దీనిపై గవర్నర్ సలహాదారులను సంప్రదించాక నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది. 15 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి రెండు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్లు దాటిన వారికి 3 ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది.

 

ఈ నెల 8న జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ఈ భేటీలో విద్యుత్ ఉద్యోగ సంఘ నేతలు గణేష్, సుధాకర్‌బాబు, వేదవ్యాస్, ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్‌కో ఎండీ విజయానంద్ పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు