వడదెబ్బకు 23 మంది మృతి

24 May, 2015 01:26 IST|Sakshi

 తూర్పు గోదావరి నెట్ వర్క్ :జిల్లాలో వడదెబ్బకు గురై శనివారం పలు ప్రాంతాలకు చెందిన 23 మంది మృతి చెందారు. తుని మండలం లోవ కొత్తూరు గ్రామానికి చెందిన బొడ్డు బాబ్జి(42) వడదెబ్బకు మృతి చెందినట్టు సర్పంచ్ తమరాన వరలక్ష్మి తెలిపారు. తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన వృద్ధురాలు బిరుదా గవర్రాజు (66) శనివారం వడదెబ్బకు గురై మృతి చెందింది. ఇంట్లో పనులు చేసుకుంటూ కుప్పకూలి మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కొత్తపల్లి మండలం వాకతిప్పకు చెందిన టైలర్ ఉద్దండ రంగ వడదెబ్బకు గురై మృతి చెందాడు. టైలరింగ్ సామగ్రి కోసం పిఠాపురం వెళ్లి ఇంటికి తిరిగివచ్చాడు. అస్వస్థతకు గురై మృతి చెందాడు.
 
  రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన పెనుగాడి పల్లపరాజు (52) వడదెబ్బకు గురై శనివారం మృతి చెందాడు. సైకిల్ టైరు మార్పించేందుకు షాపునకు వెళ్లేందుకు సిద్ధమై ఇంటి అరుగుపై కూర్చుని అస్వస్థతకు గురై మృతి చెందినట్టు వీఆర్వో లంక బాపూజీ తెలిపారు. తుని మండలం వి.కొత్తూరుకు చెందిన కనిగంటి చంద్రరావు (60) వడగాడ్పునకు గురై మృతి చెందినట్టు సర్పంచ్ తమరాన వరలక్ష్మి తెలిపారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అంగులూరి అప్పారావు (44) వడదెబ్బకు గురై మృతి చెందాడు.  పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నెల్లిపాక మండలం రాయనపేట పంచాయతీ పరిధిలోని పెనుబల్లి గ్రామానికి చెందిన శీలం భద్రమ్మ (65) మేకలను మేపేందుకు అడవికి వెళ్లి వడదెబ్బకు గురైంది.
 
  అడవిలో అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపడిపోయిన ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చి వైద్యం చేయించారు. పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బల్లగేటు సెంటర్‌కు చెందిన మట్టపర్తి లక్ష్మీ నరసమ్మ (62) శనివారం వడదెబ్బకు గురై మృతి చెందింది. మండపేట రూరల్ మండలం ఇప్పనపాడుకు చెందిన తెల్లాబత్తుల చిన్నారావు (49) వడదెబ్బకు గురై మృతి చెందాడు.సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడుకు చెందిన చెల్లుబోయిన కొండమ్మ (73) వడదెబ్బకు గురై మృతి చెందినట్టు సర్పంచ్ చెల్లుబోయిన కనక మహాలక్ష్మి తెలిపారు. ఆత్రేయపురం మండల పరిధిలోనివద్దిపర్రు, పులిదిండి గ్రామాలకు చెందిన ఇద్దరు వడగాల్పులకు మృతి చెందినట్లు తహశీల్దార్ కె. సత్యనారాయణ తెలిపారు. వద్దిపర్రు  గ్రామానికి చెందిన సుంకర కుసుమ  (65), పులిదిండి గ్రామానికి చెందిన కొండేటి మార్తమ్మ (55)లు  శనివారం వీచిన వడగాడ్పులకు మృతి చెందారన్నారు.
 
  నెల్లిపాక మండలం బండలూరు గ్రామంలో చీదర జోగయ్య(70) శనివారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన లోకారపు చిన నూకరాజు (45) అస్వస్థతకు గురై మృతి చెందాడు. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన పులుగు సింహాచలం (60) ఉదయం కూలిపనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురై మృతి చెందాడు. అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామానికి చెందిన సమయమంతుల కమలావతి (80) శనివారం వడగాడ్పులకు అస్వస్థతకు గురై మృతి చెందింది. ప్రత్తిపాడు తోట వీధికి చెందిన సోర్నపూడి రామయమ్మ (80), చినశంకర్లపూడికి చెందిన ఎం.సింహాచలం (60) వడదెబ్బకు గురై మృతి చెందారు.  దేవీపట్నం గ్రామానికి చెందిన దొడ్డసూర్యనారాయణమ్మ (85), చిన రమణ య్యపేట గ్రామానికిచెందిన అన్నిక సూరీడు (40) శనివారం వడదెబ్బకు గురై మృతి చెందారు. కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన బుర్రా మాణిక్యం (60) వడగాడ్పునకు గురై మృతి చెందినట్టు సర్పంచ్ మేరిగి ఆనందరావు తెలిపారు. పెద్దాపురానికి చెందిన శీలం శ్రీను (49) వడదెబ్బకు గురై మిరపకాయల వీధిలో మృతి చెందాడు.
 
 వడదెబ్బకు సెంట్రల్ జైల్ ఖైదీ మృతి : ఆరుగురికి అస్వస్థత
 కోటగుమ్మం (రాజమండ్రి) : రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ వడదెబ్బకు గురై శనివారం మృతి చెందాడు. మరో ఆరుగురు ఖైదీలు అస్వస్థతకు గురయ్యారు. మూడేళ్ల జైలు శిక్ష పడిన నెల్లూరుకు చెందిన గోవింద్(70) అనే వృద్ధుడు కొంతకాలంగా రాజమండ్రి సెంట్రల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బ్యారక్‌లో స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇదే మాదిరిగా మరో ఆరుగురు ఖైదీలు అస్వస్థతకు గురి కావడంతో సెంట్రల్ జైలులో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వీరిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స
 అందిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు