కరోనాను జయించి.. మనో ధైర‍్యం నింపి..

25 Apr, 2020 19:12 IST|Sakshi

కర్నూలులో కరోనాను జయించిన 24 మంది డిశ్చార్జ్‌

సాక్షి, కర్నూలు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కర్నూలు జిల్లాలో మరో 24 మంది జయించారు. శనివారం విశ్వభారతి కోవిడ్‌ ఆసుపత్రి నుంచి క్షేమంగా డిశ్ఛార్జ్‌  అయ్యారు. వైద్యుల సాయంతో కరోనాపై పోరు సాగించి..వారు అంతిమంగా విజయం సాధించారు. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 24 మంది డిశ్ఛార్జ్‌ కావడంతో బిగ్ రిలీఫ్ కలిగింది. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 31 మంది కరోనా బారిపడిన బాధితులు క్షేమంగా కోలుకుని డిశ్ఛార్జ్‌ అయ్యారు.
(కరోనా పరీక్షలు చేయించుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌)

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు,యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే మనో ధైర్యం కలిగిందని తెలిపారు. డిశ్ఛార్జ్‌ అయిన 24 మందికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్‌ వీరపాండియన్‌, స్టేట్‌ కోవిడ్‌ ప్రత్యేకాధికారి అజయ్‌ జైన్‌, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌లు ఒక్కొక్కరికి రూ.2వేల నగదు, పండ్లు, కిట్లను అందించి ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపించారు.
(ఆరోగ్య రంగంలో అవి చాలా అవసరం: సీఎం జగన్‌)

ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌కకు వెళ్లి కరోనా బారినపడిన బాధితులను ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించింది. వైద్యులు,పారా మెడికల్‌ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కృషితో కరోనాపై విజయం సాధించారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం రెండు సార్లు పరీక్షలు చేసిన అనంతరం నెగిటివ్ ఫలితం రావడంతో వారిని శనివారం సాయంత్రం డిశ్ఛార్జ్‌  చేశారు.

జిల్లాలో శనివారం డిశ్ఛార్జ్‌ అయిన వారి వివరాలు:
కర్నూలు నగరం-7
నంద్యాల-7
పాణ్యం-2
సిరవేళ్ల-2
గడివేముల-1
రుద్రవరం-1
నందికొట్కూరు-2
ఆత్మకూరు-1
డోన్‌-1

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు