24 గంటల పాటు వైద్యసేవలు బంద్

17 Sep, 2013 02:45 IST|Sakshi

విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 24 గంటల పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సీమాంధ్ర మెడికల్ జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం అన్ని ఆస్ప త్రుల్లో వైద్య సేవలు నిలిపివేయనున్నారు. జిల్లాలో 400 వరకూ ప్రైవేట్, 95 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయని, ఈ ఆస్పత్రుల్లో  మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు వైద్యసేవలు నిలిపివేయనున్నట్టు విజయనగరం మెడికల్ జేఏసీ కన్వీనర్ ఇజ్రాయిల్, సభ్యులు తెలిపారు. వారు సోమవారం విలేకరులతో మా ట్లాడారు. అయితే అత్యవసర వైద్య సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించా రు. కేంద్రాస్పత్రిలో ఓపీని కూడా నిలిపివేయనున్నట్టు ఇజ్రాయిల్ చెప్పారు. ఈ విషయాన్ని రోగులు గమనించి, సహకరించాలని ఆయన కోరా రు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు