మరో 26 మంది కరోనాను గెలిచారు..

7 May, 2020 20:09 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కరోనా వైరస్ నివారణాకు ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవడంతో కర్నూలు జిల్లాలో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా తగ్గడంతో జిల్లా వాసులకు ఉపశమనం కలుగుతుంది. కరోనాను జయించిన మరో 26 మంది బాధితులు గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు. నంద్యాల శాంతిరామ్‌ కోవిడ్‌ ఆసుపత్రి నుంచి 16 మంది, కర్నూలు విశ్వభారతి కోవిడ్‌ ఆసుపత్రి నుంచి 7 మంది, జీజీహెచ్‌ స్టేట్‌ కరోనా ఆసుపత్రి నుంచి ముగ్గురు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా తమ ఇళ్లకు చేరుకున్నారు.
(కరోనా: నిప్పు రాజేసిన పేకాట, హౌసీ)

డిశ్చార్జ్‌ అయిన వారిలో 17 మంది పురుషులు, 9 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో కరోనా బారినుంచి కోలుకుని 194 మంది డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వృద్ధులు కూడా అధిక సంఖ్యలో కరోనాను జయించారని తెలిపారు. కరోనా మహమ్మారిని జయించవచ్చనే మనోధైర్యం, నమ్మకం.. ప్రజలకు,యంత్రాంగానికి కలిగిందని కలెక్టర్‌ తెలిపారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు