266వ రోజు పాదయాత్ర డైరీ

20 Sep, 2018 02:57 IST|Sakshi

19–09–2018, బుధవారం 
పప్పలవానిపాలెం క్రాస్, విశాఖ జిల్లా  

యువత బలిదానాలకు బాధ్యత మీది కాదా బాబూ?
ఉదయం బస చేసిన ప్రాంతానికి దగ్గర్లోనే ముచ్చర్ల గ్రామం ఉంది.  ఆ గ్రామస్తులు నన్ను కలిశారు. అది ఈనాం గ్రామం. దాదాపు 1,100 ఎకరాలను దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ శిస్తు కడుతుండేవారు. కానీ వారికి ఆ భూముల మీద ఏ హక్కులూ ఉండేవి కావు. అలాం టిది.. నాన్నగారు వచ్చాక వాళ్లందరికీ సాగు హక్కులు కల్పించి పంట రుణాలు ఇప్పించారట. జన్మలో మర్చిపోలేని గొప్ప మేలు చేశారు మీ నాన్నగారని వారు చెబుతుంటే.. చాలా సం తోషమేసింది.  

ఉదయం సెంచూరియన్, సాయిగణపతి ఇంజనీరింగ్‌ కళాశాలల మీదుగా పాదయాత్ర సాగింది. ఆ కాలేజీల సిబ్బంది కలిశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నాలుగున్నరేళ్లుగా ఎదురు చూసి మోసపోయామన్నారు. తీరా ఇప్పుడు కంటి తుడుపుగా  కొన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ ఇస్తామంటూ మరో మోసా నికి సిద్ధపడ్డ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ్రోతు రాజు అనే పూర్వ విద్యార్థి కలిశాడు. చదువు పూర్తయి ఏడాది దాటినా ఫీజు రీయింబర్స్‌ కాక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ వా పోయాడు. ఆ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు వందలాదిగా వచ్చి నన్ను కలిశారు. ఈ మధ్య కాలంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్సే ఉండటం లేదన్నారు. తమకన్నా ముందు బీటెక్, ఎంటెక్‌ పూర్తిచేసిన సీనియర్లూ ఉద్యోగాల్లేక ఇళ్ల వద్దే ఖాళీగా ఉన్నారని చెప్పారు. ఏ చిన్నపాటి అటెండర్‌ ఉద్యోగం వచ్చినా చేరి పోదామని ఎదురు చూస్తున్నారట.  ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ స మస్యే ఉండేది కాదన్నది వారి ఆవేదన. విద్యావకాశాలు కల్పిం చడం ఎంతముఖ్యమో.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించడమూ అంతే ముఖ్యం. ఆ రెండూ లేని పాలనలో యువత అసహనం చెందక ఏమవుతుంది? ఆత్మన్యూనత పాలవడంలో ఆశ్చర్యమేముంది?

వేమగొట్టిపాలెంలో కలిసిన గొలగాని అప్పలస్వామి అనే తాతకు వందేళ్లు. నాన్నగారంటే వల్లమాలిన అభిమానం. నన్ను చూడాలని రెండు రోజులుగా తపిస్తున్నారట. నన్ను కలవగానే ఆనందంతో రెండు కళ్లూ చెమర్చాయి. ‘మీ నానలాగా సెయ్యా ల.. సేత్తావ్‌’ అంటూ ఆప్యాయంగా దీవించాడు. ఈ ప్రేమలు, నమ్మకాలే నన్ను నడిపిస్తున్నాయి. నాకు కొత్త శక్తి నిస్తున్నాయి. 

ఈ రోజు సాయంత్రం నన్ను ఓ గొప్ప అభిమాని కలిశాడు. పదేళ్ల శ్రీరామ్‌ పుట్టుకతోనే రెండు కళ్లూ లేని దివ్యాంగుడు. వెలుగు, చీకట్లు తెలియని పాపం పసివాడు. తన మనోనేత్రంతో నన్ను చూస్తూనే ఉన్నాడు. నేను బహిరంగ సభలలో మాట్లాడే మాటల్ని పొల్లుపోకుండా చెప్పాడు. నా హావభావాల్ని అ ద్భుతంగా ప్రదర్శించాడు. అంతులేని అభిమానం ఉంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. ఆ చిన్నారి  ప్రేమకు బందీనయ్యాను. అలసటను మర్చిపోయాను. 

సీఎంగారికి నాదో ప్రశ్న.. కమలనాథన్‌ కమిటీకి ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం మీరు అధికారంలోకి వచ్చే సమయానికి ఉన్న ఉద్యోగ ఖాళీలు 1.42 లక్షలు. ఇప్పుడవి 1.8 లక్షలు దాటిపోయాయి. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఉద్యోగా న్నయినా భర్తీ చేశారా? 1.8 లక్షలకుపైనే ఖాళీలుంటే.. ఎన్నికలకు నాలుగు నెలల ముందు కేవలం 18 వేలతో నోటిఫి కేషన్‌ ఇస్తాననడం నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేయడం కాదా? ప్రభుత్వోద్యోగాల్లేక, ప్రయివేటు కొలువులూ రాక నిరాశలో మునిగి.. ప్రత్యేక హోదా రాలేదన్న తీవ్ర మానసిక క్షోభతో జరుగుతున్న యువత బలిదానాలకు బాధ్యత మీది కాదా? 
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు