260 యూపీ స్కూళ్లలో 8వ తరగతి

20 Jun, 2014 01:20 IST|Sakshi

శ్రీకాకుళం: జిల్లాలోని 260 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతిని ప్రవేశ పెడుతున్నారు. ఈ మేరకు గురువారం రాజీవ్ విద్యామిషన్ అధికారులకు ఆదేశాలు అం దాయి. అయితే ఉపాధ్యాయ పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. రేషన్‌లైజేషన్ జరపాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో భవిష్యత్తులో అకడమిక్ ఇనస్ట్రక్టర్లను నియమిం చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 579 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యగానూ, 9 నుంచి ఇంటర్మీడియె ట్ ద్వితీయ సంవత్సరం వరకు ప్రాథమికోన్నత విద్యగానూ నిర్ణయించారు. ఆర్వీఎంకు ప్రాథమిక, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు ప్రాథమికోన్నత విద్య బాధ్యతలను అప్పగిం చారు.
 
 దశలవారీగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని, కొత్తగా నెలకొల్పుతున్న ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది 260 యూపీ స్కూళ్లలో 8వ తరగతిని ప్రవేశపెట్టడం ఆనందదాయకమే అయినప్పటికీ ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయకపోవడం ఆందోళన కలి గిస్తోంది. దీనివల్ల తమపై పనిభారం పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధికారులు మాత్రం తొలుత ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజ్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శకాలను జారీ చేయకపోవటంతో ఈ ప్రక్రియ మొదలు కాలే దు. దీనివల్ల ఏకోపాధ్యాయ, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు తరచూ మూతపడే పరిస్థితి నెలకొంది.
 
 విద్యావలంటీర్ల స్థానంలో గత ఏడా ది నుంచి ప్రవేశపెట్టిన అకడమిక్ ఇనస్ట్రక్టర్ పోస్టులను ముందే మంజూరు చేసే అధికారం జిల్లా విద్యాశాఖాధికారులకు లేదు. రేషనలైజేషన్ జరిపితేగానీ ఏ మేరకు ఇనస్ట్రక్టర్ పోస్టులు అవసరమవుతాయో గుర్తించడం కష్టం. ఈ ప్రక్రియను చేపడదామన్నా ప్రభుత్వం నియమ నిబంధనలను వెల్లడించకపోవడంతో అధికారు లు చర్యలు చేపట్టలేకపోతున్నారు. ప్రజాప్రతిని దులు జోక్యం చేసుకొని రేషనలైజేషన్ జరి పించటంతోపాటు ఉపాధ్యాయ పోస్టులు మం జూరు చేయించకపోతే విద్యార్థులు నష్టపోక తప్పదు.
 

మరిన్ని వార్తలు