29 మంది డీఎస్పీల బదిలీ

6 Nov, 2014 20:44 IST|Sakshi
29 మంది డీఎస్పీల బదిలీ

 12 మంది అధికారులకు నో పోస్టింగ్

 హైదరాబాద్: ఏపీ రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న 29 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జాస్తి వెంకట రాముడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు సహా వివిధ కారణాల నేపథ్యంలో వీరిలో 12 మందికి పోస్టింగ్ ఇవ్వలేదు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా   డీజీపీ  వారిని ఆదేశించారు. వీరిలో కొందరు స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. ఇటీవల హోంశాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం నిమ్మకాలయ చినరాజప్ప ఆగ్రహానికి గురైన తూర్పుగోదావరి జిల్లాకు చెందినడీఎస్పీ ఎం.వీరారెడ్డి (అమలాపురం) సైతం బదిలీ అయిన వారిలో ఉన్నారు. అయితే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు ఇనస్పెక్టర్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందిన నలుగురు అధికారులనూ లూప్‌లైన్స్‌లో నియమించారు.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న డి.ఆశీర్వాదం వెయిటింగ్‌లో ఉన్న 22 రోజుల కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి బయ్యారపు ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.
 
 పేరు                                    ప్రస్తుతం                బదిలీ
 జె.మల్లికార్జున వర్మ            వెయిటింగ్                అనంతపురం
 కె.రాజేంద్రప్రసాద్                వెయిటింగ్                మదనపల్లి
 డి.వెంకటకిషోర్                  సీఐడీ                 శ్రీకాళహస్తి
 కేఎస్ నంజుండప్ప               వెయిటింగ్                రేణిగుంట
 ఎస్.వెంకటేశ్వరరావు          గుంటూరు(క్రై మ్స్)            కాకినాడ
 ఆర్.రామచంద్రరావు           విజిలెన్స్                అమలాపురం
 బి.లక్ష్మీనారాయణ                వెయిటింగ్                విజిలెన్స్
 ఇ.అశోక్‌కుమార్                 చింతపల్లి                కడప
 వై.శ్రీనివాసరావు                వెయిటింగ్                అవనిగడ్డ
 బీఆర్ శ్రీనివాసులు           ఒంగోలు పీటీసీ            ఆదోని
 జి.శ్రీనివాసరావు              ఒంగోలు పీటీసీ            ఒంగోలు
 కె.భార్గవరావునాయుడు        వెయిటింగ్                శ్రీకాకుళం
 ఎన్.వెంకటేశ్వరరావు            ఏసీబీ                కొవ్వూరు
 జీబీఆర్ మధుసూదన్‌రావు    వెయిటింగ్                  విశాఖ సౌత్ ఏసీపీ
 డి.రవిబాబు                      విశాఖ ఎస్బీ                మధురవాడ
 షేక్ మగ్బూల్                  ఏసీబీ                నెల్లూరు టౌన్
 కె.ప్రభాకర్                      విశాఖ సీటీసీ                విశాఖ ట్రాఫిక్

 పోస్టింగ్ ఇవ్వని అధికారులు...
 జి.నరసింహారెడ్డి        ఆత్మకూరు            డీజీపీ కార్యాలయం
 డి.నాగరాజ            అనంతపురం            డీజీపీ కార్యాలయం
 కేవీ రాఘవరెడ్డి        మదనపల్లి            డీజీపీ కార్యాలయం
 పి.అభిషేకం            శ్రీకాళహస్తి            డీజీపీ కార్యాలయం
 ఆర్.విజయ్‌భాస్కర్‌రెడ్డి        కాకినాడ            డీజీపీ కార్యాలయం
 ఎం.వీరారెడ్డి            అమలాపురం        డీజీపీ కార్యాలయం
 సి.రాజేశ్వర్‌రెడ్డి        కడప            డీజీపీ కార్యాలయం
 ఎం.శివరామ్‌రెడ్డి        ఆదోని            డీజీపీ కార్యాలయం
 పి.జాషువా            ఒంగోలు            డీజీపీ కార్యాలయం
 వి.రాజగోపాల్        కొవ్వూరు            డీజీపీ కార్యాలయం
 కేవీ రమణ            విశాఖ సౌత్            డీజీపీ కార్యాలయం
 ఎల్.అర్జున్            విశాఖ ట్రాఫిక్        డీజీపీ కార్యాలయం
 
పదోన్నతి పొందిన అధికారులు...
 ఎస్డీ ముస్తాఫా              గుంటూరు రేంజ్        సీఐడీ
 ఏవీ రమణ                   విశాఖ రేంజ్            శ్రీకాకుళం డీటీసీ
 కె.సూర్యచంద్రరావు        ఏలూరు రేంజ్        ఇంటెలిజెన్స్
 ఎస్.రమేష్‌బాబు          ఏలూరు రేంజ్        సీఐడీ
**
 
 

మరిన్ని వార్తలు