నేడు 2వ రోజు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు

4 Jul, 2019 10:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు గురువారం రెండవ రోజు ప్రారంభంకానున్నాయి. ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఉదయం సుపరిపాలన అంశంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్‌ కృష్ణ రావు ప్రసంగం ఇవ్వనున్నారు. అనంతరం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం ఉండనుంది. మధ్యాహ్నం సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ సభ్యుల పాత్ర అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడతారు. శాసన సభ్యులు రాజకీయ నైతికత, ప్రజామోదం అంశంపై డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ ప్రసంగించనున్నారు.

మరిన్ని వార్తలు