రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

4 Mar, 2016 10:50 IST|Sakshi
మాచర్ల: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం మందాటిబోడు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. క్వారీలో పని చేయడానికి బైక్ పై వెళ్తున్న ముగ్గురు కూలీలు మందాటిబోడు వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా