-

3 కేఆర్ రుణాలు మాఫీ అయ్యేనా?

7 Jan, 2015 03:46 IST|Sakshi

హామీ ఇచ్చి విస్మరించిన చంద్రబాబు
నిరాశలో 3 కేఆర్ రైతులు

 
కుప్పం: చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే త్రీ కేఆర్ రుణాలన్నీ మాఫీ చేస్తారని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రతిపక్ష హోదాలో ఆయన కుప్పంలో పర్యటించిన సందర్భంగా అధికారంలోకి రాగానే త్రీ కేఆర్ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పు డు రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. 13 ఏళ్లుగా త్రీ కేఆర్‌లో తీసుకు న్న రుణాలు చెల్లించలేక, బ్యాంకర్ల వేధింపులు భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు 1998లో కుప్పంలో ఇజ్రారుుల్ సేద్యాన్ని ప్రారంభించారు. 1999లో 2 కేఆర్ ద్వారా రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేశారు. 2001లో 3 కేఆర్‌ను ప్రారంభించారు. తద్వారా 50 శాతం సబ్సిడీతో 2,600 వుంది రైతులకు రుణాలు వుంజూరు చేసి 7,300 ఏకరాల్లో సాగుకు శ్రీకారం చూట్టారు. డ్రిప్ పరికరాలకు కంపెనీ ఐదేళ్ల వారెంటీ ఇచ్చింది. అయితే ఏడాదికే అవి మరమ్మతులకు గురయ్యాయి. దీనిపై రైతులు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోలేదు. పైగా రైతులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు.
 
వైఎస్ హయాంలో కొంత మాఫీ


2004లో దివంగత వుుఖ్యవుంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రకటించిన రుణమాఫీలో కొంతమంది 3 కేఆర్ రైతులకు లబ్ధి చేకూరింది. ఇంకా నియోజకవర్గంలోని 663 వుంది రైతులు రూ.6.34కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. కుప్పం వుండలంలో 303 వుందికి గాను రూ.2.79 కోట్లు, శాంతిపురం వుండలంలో 251 వుందికి రూ.1.48కోట్లు, గుడుపల్లిలో 15 వుందికిగాను రూ.10లక్షలు, రావుకుప్పం వుండలంలో 126 వుంది రైతులు రూ.1.64కోట్లు, వి.కోటలో 18 వుంది రైతులు రూ.30లక్షలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో ఈ రుణాల ద్వారా తీసుకున్న డ్రిప్ పరికరాలు నాసిరకం కావడంతో పంటలకు ఉపయోగించలేకపోయాయని, అందుకే తాము రుణాలు చెల్లించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. పదేళ్లుగా రుణాలు మాఫీ చేయాలని పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపక్ష హోదాలో కుప్పంకు వచ్చిన చంద్రబాబు రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురించాయి. అయితే రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన రెండు జాబితాల్లో పేర్లు లేకపోవడంతో వారు మండిపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రికవరీ కోసం వెళితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన బ్యాంకర్లు స్తబ్దుగా ఉన్నారు. రుణాలు మాఫీ కాకపోతే ఏమి చేయాలా అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు.
 
చంద్రబాబు మాట చెప్పి తప్పాడు

2002లో 3 కేఆర్‌లో నా తండ్రి ఎల్.వుునిరత్నం పేరు మీద ఉన్న 5 ఎకరాల పొలానికి డ్రిప్‌ల కోసం రూ.2.5 లక్షల రుణం తీసుకున్నా. డ్రిప్ పరికరాలు తీసుకున్న కొద్ది రోజులకు మరమ్మతులకు గురయ్యాయి. కొత్తవి కొనుగోలు చేసి వ్యవసాయం చేయాల్సి వచ్చింది. వడ్డీతో కలిపి రూ.4లక్షలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపుతున్నారు. చంద్రబాబు వచ్చి రుణం మాఫీ చేస్తామని చెప్పడంతో సంబరపడ్డాం. జాబితాలో కనీసం మా పేర్లు లేకుండా చేశారు.
 -హేమాచలం, కొత్తిండ్లు గ్రామం,
 కుప్పం మండలం
 
 
 

మరిన్ని వార్తలు