30 నుంచి మెడికల్ కౌన్సెలింగ్

27 Aug, 2014 01:52 IST|Sakshi
30 నుంచి మెడికల్ కౌన్సెలింగ్

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల
ఏపీ, తెలంగాణల్లో 5 కౌన్సెలింగ్ కేంద్రాలు

 
విజయవాడ బ్యూరో: ఏపీ, తెలంగాణల్లో మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు 2014-15 సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ మంగళవా రం రాత్రి 10.30 గంటలకు విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో  5 కౌన్సెలింగ్ కేంద్రాలను  ఏర్పాటు చేసింది. ఏపీలో విశాఖపట్నం ఆంధ్రా వర్సిటీ క్యాంపస్, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, తిరుపతి ఎస్వీ వర్సిటీ, తెలంగాణలో హైదరాబాద్ జేఎన్‌టీయూహెచ్, వరంగల్ కాకతీయ వర్సిటీలో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల్లోని 16 ప్రభుత్వ, 23 ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా 4,610 ఎంబీబీఎస్ సీట్లు, 3 ప్రభుత్వ, 23 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,506 బీడీఎస్ సీట్లకు ఈ కౌన్సెలింగ్‌లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు.
 
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ..
 
మొదటి విడతగా తొలి మూడు రోజుల కౌన్సెలింగ్‌లో ఓపెన్ కేటగిరీ కింద అడ్మిషన్లు ఇస్తారు.   30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 1వ ర్యాంకు నుంచి 800వ ర్యాంకు వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 801 నుంచి 1,500వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్  31వ తేదీన 1,501 నుంచి 4,500వ ర్యాంకు వరకు వచ్చే నెల 1న 4,501 నుంచి 8,500 ర్యాంకు వరకు   రెండు, మూడు విడతల్లో నాలుగు రోజులపాటు రిజర్వేషన్ కేటగిరీ సీట్లను భర్తీ చేస్తారు.

వచ్చే నెల2న బీసీ-ఎ, బీసీ-బి, బీసీ-సి, బీసీ-డి, బీసీ-ఇ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1వ ర్యాంకు నుంచి 3,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది.  3వ తేదీన ఇవే కేటగిరీల రిజర్వేషన్ అభ్యర్థులకు 3,001 నుంచి 6,500 ర్యాంకు వరక     4వ తేదీన ఇవే కేటగిరీల వారికి 6,501 నుంచి 10 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది.  వచ్చే నెల 5వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఎస్సీ అభ్యర్థులకు 10,001 నుంచి 15 వేల ర్యాంకు వరకు     వచ్చే నెల 5వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఏయూ పరిధిలోని బీసీ-ఇ లోకల్ అభ్యర్థులకు 10,001 నుంచి  20 వేల ర్యాంకు వరకు, అదే సమయంలో ఏయూ, ఎస్వీయూ పరిధిలోని లోకల్ ఎస్టీ అభ్యర్థులకు 10,001 నుంచి 20 వేల ర్యాంకు వరకు, ఏయూ పరిధిలోని ఎస్టీ లోకల్ అభ్యర్థులకు 20,001 నుంచి 25 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.  5న సాయంత్రం 4 గంటల నుంచి ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో కౌన్సెలింగ్  ఎన్‌సీసీ అభ్యర్థులకు 7న ఉ.9 గంటలకు, ఆర్మీ అభ్యర్థులకు ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో  . స్పోర్ట్స్, పీహెచ్‌సీ అభ్యర్థులకు 8వ తేదీ ఉ.9 గంటలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో కౌన్సెలింగ్ జరుగుతుంది.

 కౌన్సెలింగ్‌కు వచ్చే అభ్యర్థులు ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ పాసై ఉండాలి. ఎంసెట్‌లో క్వాలిఫై అయి ఉండాలి.  అడ్మిషన్లు పొందిన ఓసీ, బీసీ అభ్యర్థులు కౌన్సెలింగ్ కేంద్రంలోనే రూ. 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 300 కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల కేటగిరీలను బట్టి యూనివర్సిటీ, ట్యూషన్ ఫీజులను చెల్లించాలి. కౌన్సెలింగ్‌లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని వీసీ రవిరాజు తెలిపారు.  పూర్తి వివరాలకు హెల్త్ వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
 
 

మరిన్ని వార్తలు