తిరుమలలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత

18 Apr, 2016 02:02 IST|Sakshi

ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఇదే రికార్డు
శేషాచలంపై జోరందుకున్న వడగాడ్పులు

 

తిరుమల: తిరుమలలో పగటి ఉష్ణోగ్రత పెరిగింది. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు,  కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు నమోదైంది. 1998 జూన్ 5వ తేదీన తిరుమలకొండ మీద  38.4 డిగ్రీలు నమోదైంది. ఇప్పటివరకు ఇక్కడ ఇదే అత్యధిక ఉష్ణ్రోగ్రతగా రికార్డుగా నమోదైంది. కాగా ఈ సీజన్‌లో ఆదివారం పెరిగిన ఉష్ణోగ్రతలే ఎక్కువ. ఫలితంగా ఉక్కపోత పెరిగింది.


అన్ని వేళలా చల్లని గాలులతో ఉండే తిరుమలకొండ మీద కూడా  వడగాడ్పులు జోరందుకున్నాయి.  భక్తులు ఇబ్బందిపడుతున్నారు. మధ్యాహ్న వేళలో  బయటకు రావటానికి ఇష్టపడటం లేదు. సాయంత్రం వేళ కూడా ఆలయ ప్రాంగణం బోసిపోయింది. పెరిగిన ఉష్ణ్రోగ్రతలకు తగ్గట్టుగానే ఉపశమన చర్యలు టీటీడీ యంత్రాంగం వేగవంతం చేసింది.

 

మరిన్ని వార్తలు