నోటికాడి బుక్కలాక్కున్నరు

17 Sep, 2013 02:27 IST|Sakshi

 వరంగల్, న్యూస్‌లైన్ : వృద్ధులు, వితంతువులు, పేద వర్గాల నోటికాడ బుక్కను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంది. పింఛన్లు, తెల్ల రేషన్‌కార్డులు, వ్యక్తిగత రుణాలను ఇచ్చినట్టే ఇచ్చి వాపస్ తీసుకుంది. జిల్లాకు బదిలీ చేసిన సొమ్మును తిరిగి సర్కారు ఖాతాల్లోనే జమ చేసుకుంది. సీమాం ధ్రలో ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ ప్రభుత్వ పథకాలను ఎందుకు అమలు చేయూలనుకుందో... ఏమో గానీ మూడో విడత రచ్చబండ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో పంపిణీ చేయూలనుకున్న పింఛన్లు, తెల్ల రేషన్‌కార్డులు, బీసీ కార్పొరేషన్ వ్యక్తిగత రుణాలన్నింటికీ బ్రేక్ వేసింది. ఈ మూడింటినీ కెప్టెన్సీ అభయన్స్‌లో పెడుతూ ఆదేశాలిచ్చింది.
 
34 వేల మందికి ఉత్తి ‘చేయి’

 పింఛన్లు మంజూరు చేయూలని రచ్చబండ-2తోపాటు ఇదివరకు దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, వితంతువులకు మళ్లీ నిరాశే ఎదురైంది. జిల్లావ్యాప్తంగా 38,900 మంది కొత్త పింఛన్ల కోసం రెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వీటిలో ప్రభుత్వం 34,691 పింఛన్లను ఈ ఏడాది జూలైలో మంజూరు చేసింది. వీటిని ఆగస్టు నుంచి పంపిణీ చేయాలని అప్పుడే ఆదేశాలివ్వడమే కాకుండా జిల్లాలో కొత్త పింఛన్ల కోసం రూ. 76.41 లక్షలను డీఆర్‌డీఏ ఖాతాలో జమ చేసింది. జిల్లా అధికారులు ఆ డబ్బులను ఆగస్టు మొదటివారంలో పంపిణీ చేసేందుకు సిద్ధమైన తరుణంలో సర్కారు  మళ్లీ ఆంక్షలు విధించింది.

కాంగ్రెస్‌కు లబ్ధి జరిగేలా మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వీటిని పంచాలని సూచించింది. కానీ ఆ సమయంలో మంత్రులకు తీరిక లేకపోవడంతో ఈ కార్యక్రమం వారుుదా పడింది. ఇక సెప్టెంబర్ నుంచి పింఛన్ల సొమ్ము పంపిణీ చేయూలని ప్రభుత్వం తిరిగి ఆదేశాలిచ్చింది. అంతలోనే ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది. మూడో విడత రచ్చబండ సభల్లో వీటిని పంచాలని... అరుుతే ఇప్పుడా పరిస్థితి లేదని... పింఛన్లను పంపిణీ చేయొద్దంటూ  అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కెప్టెన్సీ అభయూన్స్‌లో పెడుతూ జిల్లా ఖజానాకు తాళం వేసింది. ఇంతలో పింఛన్ల సొమ్ము మీ జిల్లా ఖాతాలో వద్దంటూ... ఉన్న ఫళంగా సర్కారు తమ ఖాతాలోకి మళ్లించుకుంది.  దీంతో రెండేళ్ల నుంచి పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వారికి నోటికి అంది వచ్చిన బుక్క అందకుండా పోయినట్లరుుంది.

 ఆన్‌లైన్‌లో అన్నీ మాయం

 పింఛన్ల లబ్ధిదారుల జాబితాను ఈనెల నాలుగో తేదీ వరకు ఆన్‌లైన్‌లో పెట్టిన సర్కారు... ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించింది. గంటల వ్యవధిలో ఒక్క పేరు లేకుండా తీసేయడం గమనార్హం.  ప్రస్తుతం కొత్త పింఛన్ల జాబితా ఆన్‌లైన్‌లో లేదు. దీనిపై డీఆర్‌డీఏ అధికారులు కూడా తమకేం కారణాలు తెలియవంటున్నారు. పింఛన్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో వాటి డబ్బులు సర్కారు ఖాతాలోకి మళ్లాయని చెబుతున్నారు.

 రేషన్ కార్డులు, వ్యక్తిగత రుణాలకూ బ్రేక్

 జిల్లాకు 15 వేల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం... వాటిని కూడా పంపిణీ చేయొద్దంటూ ఆదేశాలిచ్చింది.  మళ్లీ ఆదేశాలిచ్చేంత వరకు వాటిని పెండింగ్‌లో పెట్టాలని అధికారులకు సూచించింది. అదే విధంగా చాలా రోజుల తర్వాత బీసీ కార్పొరేషన్ నుంచి వ్యక్తిగత రుణాలు మంజూరయ్యాయి. రూ. 1.20 కోట్లతో 400 యూనిట్లు మంజూరు చేసింది. ఒక్కో యూనిట్‌కు రూ. 30 వేల సబ్సిడీతో వ్యక్తిగత రుణాలిచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జాబితా కూడా తయూరు కాగా... త్వరలోనే వాటిని లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యూరు. అంతలోనే సర్కారు వాటికి  బ్రేక్ వేసింది. రుణాలు ఇప్పుడే ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా