34 గ్రామాల నీటిలో బ్యాక్టీరియా

26 Apr, 2018 07:13 IST|Sakshi
అధికారులు సేకరించిన శాంపిల్స్‌

జిల్లా వ్యాప్తంగా 3124 శాంపిళ్ల సేకరణ

మూడు బృందాలతో పరిశీలన

సూపర్‌ క్లోరినేషన్‌ తర్వాత నీటి విడుదల

సాక్షి, అమరావతి బ్యూరో: నగరంలో డయేరియా వ్యాధికి గురై 30 మందికిపై మృత్యువాత పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ విస్తరణాధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఏర్పడ్డారు. ఏప్రిల్‌ 10, 11, 12 తేదీలలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 3124 శాంపిల్స్‌ సేకరించారు. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వైల్‌ ద్వారా నీటి నమూనాలను పరిక్షించారు. అందులో 34 శాంపిల్స్‌ సురక్షితం కాదని గుర్తించారు. ఈ నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నీటిని సూపర్‌ క్లోరినేషన్‌ చేశారు. పెదకూరపాడు, వినుకొండ, వెల్దుర్తి, మాచవరం, కారంపూడి మండలాలలో ఈ సమస్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 177 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతుందని, రూ.10.23 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 

నీటి సమస్య రానివ్వం
గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్యాంకర్ల సంఖ్యను పెంచుతున్నాం. పైపులైన్లకు మరమ్మతులు చేపడుతున్నాం.– భాను వీరప్రసాద్, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్, గుంటూరు

మరిన్ని వార్తలు