ఏపీలో 303కి చేరిన కరోనా కేసులు

6 Apr, 2020 19:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కి చేరింది. సోమవారం ఒక్కరోజే కొత్తగా 37 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా కర్నూలులో 18, నెల్లూరు 8, పశ్చిమ గోదావరి 5, కడప 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క పాజిటివ్‌ కేసు వెలుగుచూశాయి. మరోవైపు ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకుని ఆరుగురు డిశ్చార్‌ అయ్యారు.  ఇక మొత్తం జిల్లాల వారిగా చూస్తే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అత్యధికంగా కర్నూలు 74లో నమోదు అయ్యాయి.

నెల్లూరులో 42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27, ప్రకాశం 24, పశ్చిమ గోదావరి 21, విశాఖపట్నం 20, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, అనంతపురం 6 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ‍ప్రకటన విడుదల చేసింది. ఇక కరోనా నిర్ధారణ పరీక్షల కోసం విశాఖపట్నంలో వైరల్‌ ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. రూ.కోటి 25 లక్షలతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వైరస్‌ నిర్ధారణకు 6 గంటల సమయం పట్టనుంది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ వైరల్‌ ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది. (ఏప్రిల్‌ 15తో లాక్‌డౌన్‌ ముగుస్తుందా..?)


 

మరిన్ని వార్తలు