జనతా ట్రావెల్స్ బస్సు బోల్తా, 38మందికి గాయాలు

6 Oct, 2014 09:10 IST|Sakshi

కర్నూలు : కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 38మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  హైదరాబాద్కు చెందిన కొంతమంది  తీర్థయాత్రల కోసం జనతా ట్రావెల్స్కు చెందిన ఓ బస్సును బుక్ చేసుకున్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి శబరిమలై వెళుతున్నారు.

ఈ సందర్భంగా  మహానందికి వెళుతుండగా అడ్డు వచ్చిన చిన్నరాయిని డ్రైవర్ తప్పించబోయాడు. అయితే బస్సు అదుపు తప్పటంతో బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 44మంది ఉన్నారు. కేవలం ఆరుగురు మాత్రమే ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దర్ని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా