ఖైరతాబాద్ గణేష్కు 'మహాలడ్డు' సిద్ధం

7 Sep, 2013 13:30 IST|Sakshi

ఖైరతాబాద్ వినాయకుడి (గణేష్) కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 'మహాలడ్డు' పూర్తి అయిందని తూర్పుగోదావరి జిల్లా, తాపేశ్వరం గ్రామంలోని సురుచి స్వీట్స్ అధినేత పీవీవీఎస్ మల్లిఖార్జునరావు శనివారం ఇక్కడ వెల్లడించారు. నాలుగు వేల కేజీల బరువు కలిగిన ఆ లడ్డును ప్రత్యేక వావానంలో రేపు హైదరాబాద్ తరలిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 70 మంది కార్మికులు గత వారం రోజులుగా నిరంతరం శ్రమించి ఆ లడ్డును తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

 

ఆ లడ్డు కోసం 1600 కేజీల పంచదార, 1000 కేజీల శనగపప్పు, 900 కేజీల నెయ్యి, 200 కేజీల జీడిపప్పు, 100 కేజీల బాదం పప్పు, 50 కేజీల ఏలకులు,10 కేజీల పచ్చ కర్పురం ఆ మహాలడ్డు తయారీలో వాడినట్లు మల్లిఖార్జునరావు వివరించారు. అలాగే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం చేతిలో ఉంచేందుకు 56 కేజీల లడ్డును తయారు చేసినట్లు, ఆ లడ్డును కూడా మహాలడ్డుతో పాటు పంపిస్తామని మల్లిఖార్జునరావు చెప్పారు.

మరిన్ని వార్తలు