416 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

22 Nov, 2014 02:25 IST|Sakshi

నెల్లూరు (విద్య) : టెట్, టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా జిల్లాలో 416 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ సారి ప్రత్యేకంగా మున్సిపాల్టీల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లను భర్తీచేసేందుకు జీఓ విడుదల చేశారు. దీంతో 78 పోస్టులు అధికంగా భర్తీ కానున్నాయి. మొత్తం 494 పోస్ట్‌లు భర్తీకానున్నాయి. మున్సిపాల్టీకి కేటాయించిన పోస్టుల్లో 78 స్కూల్ అసిస్టెంట్స్ 4, ఎస్జీటీలు 42, తెలుగు పండిట్‌లు 18, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు 14 పోస్ట్‌లు ఉన్నాయి.

జిల్లాలో జెడ్‌పి, ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 416 పోస్టుల్లో ఎస్జీటీ తెలుగు 289, ఉర్దూ 18,  భాషా పండితులు తెలుగు 35, ఉర్దూ 4, సంస్కృతం 2, హిందీ 1,  పీఈటీలు 10, స్కూల్ అసిస్టెంట్స్ పిఎస్ 3, బయోలాజికల్ సైన్స్ 8, సోషల్ స్టడీస్ 29, ఇంగ్లీష్ 6, తెలుగు 8, హిందీ 3 పోస్ట్‌లకు అభ్యర్థులు అర్హత పరీక్షలను రాయనున్నారు. పోస్ట్‌లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. ఎట్టకేలకు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జెండా ఊపడంతో అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం కనబడుతోంది.

మరిన్ని వార్తలు