వారణాసి నుంచి 44 మంది సొంత ప్రాంతానికి

16 Apr, 2020 18:00 IST|Sakshi

సాక్షి, విశాఖ : వారణాసిలో చిక్కుకుపోయిన 44 మంది తెలుగు రాష్ట్రాల యాత్రీకులు విశాఖ శారదా పీఠం చొరవతో సొంత ప్రాంతానికి చేరుకున్నారు. గత నెలలో వారణాసి విహార యాత్రకు వెళ్లిన 44 మంది తెలుగు రాష్ట్రాల యాత్రీకులు కరోనా ఆంక్షల కారణంగా కాశీలోనే చిక్కుపోయారు. లాక్ డౌన్ విధించిన దగ్గర నుంచి గత మూడు వారాలుగా వారణాసిలోని శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమంలో వారు తలదాచుకున్నారు .ఈ నేపధ్యంలో లాక్ డౌన్ మే మూడవ తేదీ వరకు పొడిగించడంతో యాత్రీకులను సొంత ఉర్లకు చేర్చేలా చొరవ చూపాలని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర,  స్వాత్మానందేంద్ర స్వామీలను ఆంధ్ర ఆశ్రమ నిర్వాహకులు సుందరశాస్త్రి సంప్రదించారు. 

ఈ విషయాన్ని విశాఖ శారదా పీఠాధిపతులు అధికారుల దృష్డికి తీసుకెళ్లగా.. శారదా పీఠాధిపతులు, ఏపీ అధికారుల చొరవతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం స్పందించి యాత్రీకులకు ప్రత్యేక అనుమతి మంజూరు చేసి పాస్‌లు ఇచ్చారు. దీంతో వీరంతా ప్రత్యేక బస్సులో వారణాసి నుంచి బయలుదేరారు. యాత్రీకులకి మార్గమధ్యంలో ఆహార కొరత లేకుండా భోజన ప్యాకెట్లను విశాఖ శారదాపీఠం వారణాసి శాఖ ఆంధ్ర ఆశ్రమం అందజేసింది. ఇందులో విశాఖ జిల్లాకే చెందిన 33 మంది యాత్రీకులు అర్ధరాత్రి విశాఖ చేరుకోవడంతో వారందరినీ వైద్య పరీక్షలకి ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు