ఈశాన్య బంగాళఖాతంలో అల్పపీడనం..

1 Aug, 2019 14:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన పీడనం.. ఉత్తరాంధ్రని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో 5.8 నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనంగా కొనసాగనున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తన పీడనం ప్రభావం వల్ల ఈ నెల 4న ఈశాన్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ తీరం వెంబడి  గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు