ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం, ఐదుగురు మృతి

27 Dec, 2013 08:14 IST|Sakshi

హైదరాబాద్ : నగర శివారులోని ఔటర్‌రింగ్‌ రోడ్డుపై తరచూ రోడ్డుప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా  తుక్కుగూడలో ఔటర్‌రింగ్‌ రోడ్డుపై శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు మరో నలుగురి పరిస్థితి విషమం ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు మగవాళ్లు ఉన్నారు. మృతులది మహారాష్ట్రకు చెందిన వాళ్లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు