50 వేల బీటీ పత్తి విత్తనాల బస్తాలు సీజ్

3 Jun, 2015 16:22 IST|Sakshi

గుంటూరు: గుంటూరులోని కావేరి సీడ్స్ పై విజిలెన్స్ అధికారులు బుధవారం సాయంత్రం దాడి చేసి రూ.5 కోట్ల విలువైన 50వేల బీటీ పత్తి విత్తనాల బస్తాలను సీజ్ చేశారు. గుంటూరులోని కావేరి సీడ్స్ సంస్థ వారు తమ కార్యాలయాన్ని ఇటీవల సిటీ సెంటర్‌లో ఏర్పాటుచేశారు. అందులో 50వేల బస్తాల బీటీ పత్తి విత్తనాలను నిల్వచేశారు. అయితే కార్యాలయానికి అనుమతి తీసుకోలేదన్న కారణంగా విజిలెన్స్ అధికారి వెంకట్రావు ఆధ్వర్యంలో అధికారులు బుధవారం దాడిచేసి పత్తి విత్తనాల విక్రయాలను నిలిపివేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విత్తనాలను నిల్వ ఉంచినందున కేసు నమోదు చేశామని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు