శ్రీవారి దర్శనానికి 58 గంటలు  

22 May, 2018 04:46 IST|Sakshi

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో సందడిగా మారింది. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఎక్కువ మంది భక్తులు కాలినడకన తిరుమలకు వస్తున్నారు. ధర్మదర్శనం యాత్రికులతో సమానంగా టైంస్లాట్‌ దర్శనం భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉన్నారు.

సోమవారం ఉదయం నుంచి 22 కంపార్ట్‌మెంట్లలో ధర్మదర్శనం భక్తులు వేచి ఉన్నారు. వీరికి శ్రీవారిని దర్శించుకునేందుకు సుమారు 58 గంటలు సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం అర్ధరాత్రికి 95,021 మంది, సోమవారం 58, 608 భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు వెల్లడించారు. ఇంకా లక్షమందికిపైగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.  

మరిన్ని వార్తలు