గోదావరి పుష్కరాలకు 58 ప్రత్యేక రైళ్లు

27 Jun, 2015 23:44 IST|Sakshi
గోదావరి పుష్కరాలకు 58 ప్రత్యేక రైళ్లు

- పలు రైళ్లకు అదనపు బోగీలు
దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ప్రకటన


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో జరుగనున్న గోదావరి పుష్కరాలకు వెళ్లే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే  58 ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే పలు రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక రైళ్ల కోసం ఆదివారం (జూన్ 28) ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం ప్రారంభం కానున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు కాకినాడ-హైదరాబాద్-కాకినాడ (07701/07702) మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడుపుతారు. జూలై 12, 16, 20, 24 తేదీలలో రాత్రి 11 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జూలై 13, 17, 21, 25 తేదీలలో సాయంత్రం 3.45 గంటలకు  హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45కు కాకినాడ చేరుకుంటాయి. ఈ రైళ్లు విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా నడుస్తాయి.

కాకినాడ-హైదరాబాద్-కాకినాడ (07703/07704) మధ్య మరో 8  ప్రత్యేక రైళ్లు జూలై 14, 18, 22, 26 తేదీలలో సాయంత్రం 7.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30కు హైదరాబాద్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జూలై 15, 19, 23, 27 తేదీలలో సాయంత్రం 3.45కు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45కు కాకినాడ చేరుకుంటాయి. ఈ రైళ్లు సైతం విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్‌ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

 హైదరాబాద్-విశాఖ-హైదరాబాద్ (07706/07705) మధ్య 8 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. జూలై 12, 16, 20, 24 తేదీలలో రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.15కు విశాఖ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జూలై 13, 17, 21, 25 తేదీలలో సాయంత్రం 4.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు హైదరాబాద్ చేరుకుంటాయి. విజయవాడ, కాజీపేట్ మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి.
 
హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్డు-హైదరాబాద్ (07708/07707) మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 14, 18, 22, 26 తేదీలలో సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15కు శ్రీకాకుళం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జూలై 15, 19, 23, 27 తేదీలలో మధ్యాహ్నం 1.15 కు శ్రీకాకుళం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు హైదరాబాద్ చేరుకుంటాయి.

తిరుపతి-పార్వతీపురం-ధర్మవరం (07709/07710) మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 13, 17, 21, 25 తేదీలలో రాత్రి 11 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు పార్వతీపురం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో పార్వతీపురం-ధర్మవరం (07710) జూలై 14, 18, 22, 26 తేదీలలో సాయంత్రం 6.45 కు పార్వతీపురం నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.25 కు ధర్మవరం చేరుకుంటాయి.

 విజయవాడ-విశాఖపట్టణం (07714) మధ్య 8 ప్రత్యేక రైళ్లు జూలై 16, 17, 18, 19, 23, 24, 25, 26 తేదీలలో రాత్రి 11 గంటలకు  బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటాయి.

అనకాపల్లి-మచిలీపట్నం (07713) మధ్య జూలై 19, 26 తేదీలలో సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు మచిలీపట్నం చేరుకుంటాయి.

అదనపు బోగీలు....
సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-బెంగళూర్ శేషాద్రి ఎక్స్‌ప్రెస్,తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి-బిలాస్‌పూర్, కాచిగూడ-చెన్నై, కాకినాడ-చెన్నై, తదితర రైళ్లలో ఏసీ టూటైర్, ఏసీ త్రీటైర్, జనరల్ సెకెండ్ క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు