6న తాండవ నీరు విడుదల

2 Aug, 2014 02:40 IST|Sakshi
  •      నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రాంబాబు
  •      ఆయకట్టుదారులతో అత్యవసర సమావేశం
  • నాతవరం : తాండవ ఆయకట్టుదారులు, ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు ఆగస్టు 6వ తేదీన ఖరీఫ్ పంటకు సాగు భూములకు నీరు విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రాంబాబు చెప్పారు. తాండవ ైరె తుల విశ్రాంతి భవనంలో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఆయకట్టుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎంపీపీ సంగంపల్లి సన్యాసి దేముడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌ఈ మాట్లాడుతూ జిల్లాలో తాండవ ఒక్కటే ప్రధాన జలాశయమని తెలిపారు.

    ఇతర జలాశయాలతో పోల్చుకుంటే తాండవలో మాత్రమే నీటి మట్టం బాగుందన్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 374 అడుగులు ఉందన్నారు. ఖరీఫ్ పంటకు 62 రోజులు మాత్రమే సరాఫరా అవుతుందన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు  ఐక్యంగా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఏటా తాండవ నీరు విడుదల చేసిన వెంటనే వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దాని ప్రకారం ఏమాత్రం వర్షం కురిసినా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు.

    నీరు విడుదల తేదీని ఖరారు చేయాలని ఆయన కోరగా, 6వ తేదీన విడుదల చేస్తేనే రైతులకు ఉపయోగం ఉంటుందని రెండు జిల్లాల ఆయకట్టుదారులు సూచించారు. వారి కోరిక మేరకు ఆ తేదీన నీటిని విడుదల చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా కొందరు నీటి సంఘాధ్యక్షులు, ైరైతులు కాలువల సమస్యలను ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా శివారు భూములకు నీరందక పోవడం, సిమెంటు లైనింగ్ పనులు కూలిపోవడం తదతర అంశాలను వివరించారు.

    రైతులు, ప్రజాప్రతినిధులు తెలియజేసిన సమస్యలను  త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాతవరం ఎంపీపీ సింగంపల్లి సన్యాసిదేముడు, జెడ్పీటీసీ సభ్యుడు కరక సత్యనారాయణ, నర్సీపట్నం ఎంపీపీ సుకల రమణమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు చదలవాడ సువర్ణలత, డీఈ షణ్ముఖరావు, వ్యవసాయశాఖ ఏడీ శివప్రసాద్  విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు