ఆన్‌లైన్‌లో 61,858  ఆర్జితసేవా టికెట్లు

3 Feb, 2018 02:25 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి మే నెల కోటాలో మొత్తం 61,858 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,913 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 8,013, తోమాల 150, అర్చన 150, అష్టదళ పాదపద్మారాధన 300, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని వివరించారు.

పాతవిధానంలో 50,945 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 11,625, ఊంజల్‌సేవ 3,100, ఆర్జితబ్రహ్మోత్సవం 6,665, వసంతోత్సవం 13,330, సహస్రదీపాలంకారసేవ 14,725 టికెట్లు ఉన్నాయని తెలిపారు. టికెట్లు రిజిష్ట్రేషన్‌ చేసుకునేందుకు నాలుగు రోజుల పాటు అవకాశం ఉంటుందని, లక్కీడిప్‌ ద్వారా టికెట్లు పొందిన భక్తులు ఆ తర్వాత  3 రోజుల్లోపు టికెట్లకు సంబంధించి నగదు చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు.

విదేశీ నాణేలు మార్పిడికి చర్యలు: ఈవో 
టీటీడీ ఖజానాలో మొత్తం 45 టన్నుల విదేశీ నాణేలు ఉన్నాయని, వాటిని మార్పిడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఈవో అనిల్‌ కుమార సింఘాల్‌ తెలిపారు. టీటీడీ కల్యాణ మండపాలు కూడా ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రారంభించామని, తొలిదశలో ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని 39 కల్యాణ మండపాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామన్నారు.

మరిన్ని వార్తలు