7,850 బోగస్ కార్డులు రద్దు

20 Aug, 2014 03:49 IST|Sakshi
7,850 బోగస్ కార్డులు రద్దు

విజయనగరం కంటోన్మెంట్ : జిల్లావ్యాప్తంగా 7,850 బోగస్ రేషన్ కార్డులను రద్దు చేస్తూ.. జేసీ బి. రామారావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే గతంలో సరెండర్ చేసిన 19 వేల కార్డులను కూడా రద్దు చేశారు. జిల్లాలో గతంలో నిర్వహించిన 2, 3 రచ్చబండ సభల్లో రేషన్ కా ర్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తులను పరిశీలించిన అధికారులు మొత్తం 56, 382 కార్డులు మంజూరు చేశారు. వీటిని పంపిణీ చేసేం దుకు అధికారులు గ్రామాల్లోకి వెళ్లగా కొన్నిచోట్ల లబ్ధిదారులు లేకపోవడంతో సుమారు 5 వేల కార్డులు మిగిలిపోయాయి. అలాగే ఇటీవల కూపన్లు అయిపోవడంతో కొత్తగా ఎన్టీఆర్ ప్రజా పంపిణీ కూపన్లను ప్ర భుత్వం పంపిణీ చేసింది.
 
వీటిని కూడా పంపిణీ చేసేందుకు అధికారులు గ్రామాల్లోకి వెళ్లగా.. మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. దీంతో మొత్తం 56, 382 కార్డులకు గాను 48, 532 కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన 7850 కార్డులను అధికారులు వెనక్కి తీసుకువచ్చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు జేసీ ప్రక టించారు. కొందరు రాజకీయ నాయకులు గ్రామాల్లో లబ్ధిదారులు స్థానికంగా లేకపోరుునా తమ రాజకీయ పలుకుబడి తో కార్డులు మంజూరు చేయించుకున్నారు.

అలాంటి వాటిని కూడా రద్దు చేస్తూ..ఆదేశాలు జారీ అయ్యూరుు. అలాగే గతం లో జిల్లాలో బోగస్ కార్డులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో జిల్లావ్యాప్తంగా సుమారు 19 వేల బోగస్ కార్డులను గుర్తించారు. అప్పట్లో వీటికి తక్షణమే సరుకులు నిలిపివేశారు. కానీ రికార్డుల్లో నుంచి తొలగించలేదు. ప్రస్తుతం వీటిని కూడా రద్దు చేశారు.
 
ఆధార్ సీడింగ్ కోసమే...
రేషన్‌కార్డులకు ఆధార్ తప్పనిసరి కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారుు. ఆధార్ అనుసంధానం కాకపోతే రేషన్ నిలిపివేస్తామని ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరిస్తుండడమే కాకుండా ఈ నెలాఖరుకు గడువు విధించడంతో అధికారులు ఇప్పుడు ఆధార్ అనుసంధానాన్ని వేగవంతం చేస్తున్నారు. దీంతో రికార్డుల్లో ఉన్న రేషన్‌కార్డుల్లో బోగస్ కార్డులను రద్దు చేస్తే అనుసంధానం చేసే సంఖ్య కూడా తగ్గి ముందు వరుసలోకి వస్తామన్నది వారి ఆలోచన.
     
ఎప్పటికైనా ఈ కార్డులను రద్దు చేయూల్సిందే కనుక ఇప్పుడే రద్దు చేస్తే ఆధార్ అనుసంధాన ప్రక్రియలో సీడింగ్ శాతం కూడా మెరుగవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నా రు. ఈ మేరకు జేసీ జిల్లాలోని పంపిణీ కాని రచ్చబండ కార్డులను రద్దు చేసేందుకు తహశీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలని డీఎస్‌ఓ హెచ్‌వీ ప్రసాదరావును ఆదేశించారు. టెలికాన్ఫరెన్సు ద్వారా ఈ ఆదేశాలు అమలు కావాలన్నారు. 

మరిన్ని వార్తలు