77 నామినేషన్ల తిరస్కరణ

27 Mar, 2019 10:42 IST|Sakshi
నామినేషన్ల పరిశీలన చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌  

పార్లమెంట్‌ స్థానాల నామినేషన్లు 6

అసెంబ్లీ స్థానాల నామినేషన్లు 65

సాక్షి, ఒంగోలు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు దాఖలైన నామినేషన్లను పరిశీలించి సక్రమంగా లేని వాటిని రిజెక్టు చేశారు. రిజెక్ట్‌ అయిన వాటిలోఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొత్తం 17నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 4 నామినేషన్లు తిరస్కరించారు. బాపట్ల పార్లమెంట్‌కు మొత్తం 16 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 2 నామినేషన్లు తిరస్కరించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 237 నామినేషన్లు దాఖలైతే వాటిలో 65 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 172 నామినేషన్లు ఆమోదం పొందాయి. రిజెక్ట్‌ అయిన వాటిలో యర్రగొండపాలెం నియోజకవర్గంలో 4, దర్శి 10, పర్చూరులో 2, అద్దంకిలో 3, చీరాల 3, సంతనూతలపాడు 2, ఒంగోలు 5, కందుకూరు 12, కొండపి 3, మార్కాపురం 7, గిద్దలూరు 10, కనిగిరి 14  నామినేషన్లు రిజెక్ట్‌ అయ్యాయి. 

మరిన్ని వార్తలు