బాదం చెట్టెక్కి.. షాక్‌తో విద్యార్థి మృతి

12 Mar, 2016 01:59 IST|Sakshi

అందివస్తాడనుకున్న కొడుకు అర్ధంతరంగా అందని తీరాలకు చేరుకోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని వారు కన్న కలలన్నీ కల్లలవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఆనందంగా సాగిపోతున్న తమ జీవితంలో విద్యుత్‌తీగ రూపంలో విషాదం చోటు చేసుకుందని తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే కన్నకొడుకును కోల్పోయిన వారిని చూసి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు.
 
* విద్యుత్‌వైరు తాకి విద్యార్థి మృతి
* బాదం పిక్కలకోసం చెట్టెక్కి మృత్యువాత
* మరొకరికి తీవ్ర గాయూలు
* గుండెలవిసేలా రోదిస్తున్న కన్నవారు
* జయితిలో విషాదఛాయలు


జయితి (మెంటాడ) : విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి నిండు ప్రాణం గాలిలో కలిసిపోగా, మరో విద్యార్థి తీవ్ర గాయూల పాలైన సంఘటన మండలంలోని జరుుతి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నారుు. గ్రామానికి చెందిన గెద్ద నాగరాజు(ఏడో తరగతి), మన్నెపురి సురేష్(ఆరో తరగతి) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం కూడా చేశారు.

ఒంటిపూట బడులు కావడంతో 12.30 గంటల సమయంలో స్కూల్ వదిలేశారు. వెంటనే ఆ ఇద్దరు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి బ్యాగులు పెట్టేసి బాదం పిక్కల కోసం గ్రామ సమీపంలో ఉన్న మల్లికార్జునస్వామి ఆలయూనికి సుమారు రెండున్నర గంటల సమయంలో వెళ్లారు. అక్కడున్న బాదం చెట్టు ఎక్కి పిక్కలు తీస్తుండగా చెట్టుకు ఆనుకుని వెళ్తున్న విద్యుత్ వైర్లు తగిలి నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, సురేష్ మాత్రం తీవ్ర గాయూలతో కింద పడిపోయూడు. వెంటనే స్థానికులు 108కి సమాచారం ఇచ్చి సురేష్‌ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆండ్ర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
 స్పృహ కోల్పోయిన నాగరాజు తల్లి
 మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, లక్ష్మి, నాన్నమ్మ పాపమ్మలను  ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కుమారుడి మృతదేహం చూసిన తల్లి లక్ష్మి  ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాగరాజు అన్నయ్య శంకరరావు గజపతినగరంలో ఇంటర్ చదువుతున్నాడు. విద్యార్థుల కుటుంబాలను విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్ ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు