నేపాల్ నుంచి తిరిగొచ్చిన 8 మంది తెలుగువారు

26 Apr, 2015 17:42 IST|Sakshi

హైదరాబాద్: నేపాల్లో చిక్కుకున్న 8 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా తిరిగి వచ్చారు. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చి, అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రం  హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

నేపాల్లో ఉన్న భారతీయులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక విమానాల ద్వారా ఈ రోజు ఉదయం 564 మందిని ఢిల్లీకి తరలించారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తెలుగు యాత్రికులు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోవచ్చు.

మరిన్ని వార్తలు