వడదెబ్బకు ఎనిమిదేళ్ల బాలుడు బలి

24 May, 2015 11:02 IST|Sakshi

గుంతకల్ : అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఎనిమిదేళ్ల బాలుడు వడదెబ్బతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మస్తాన్‌పేటకు చెందిన షేక్సావలీ(8) శనివారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పితో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. వడదెబ్బ వల్లే మరణించినట్లు ధ్రువీకరించారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు