నకిలీ పత్రాల తయారీ ముఠా అరెస్ట్

24 Feb, 2015 20:17 IST|Sakshi

కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): నకిలీ పత్రాలను తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కడప అర్బన్‌లో మంగళవారం జరిగింది. వివరాలు..ర వీంద్ర నగర్‌కు చెందిన సయ్యద్ జైనుల్లా అబిబుల్ పట్టణంలో ట్రావెల్ వర ల్డ్ షాపును నడుపుతున్నాడు. ఈ క్రమంలో పాస్‌పోర్టును పోగోట్టుకున్న బచ్చావలే షౌకత్‌అలీ అబిబులాను సంప్రదించి కొత్త పాస్‌పోర్టును ఇప్పించాలని కోరాడు. అందుకు గాను రూ. 4000 నగదును ముట్టజెప్పాడు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీల్లో షౌకత్‌అలీ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అతన్ని అదపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. పోలీసులు వెంటనే అబిబుల్‌ను, అతనికి సహాకరిస్తున్న షేక్ మహమ్మద్ గౌస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరితో సంబంధం ఉన్న సాయిపేటకు చెందిన ఏబీ ప్రింటర్స్ షాప్ నిర్వాహకుడు ఖాజా మోహినుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. వీరందరు పాస్‌పోర్టు పరిశీలనకు కావాల్సిన నకిలీ పత్రాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా వీరు డెత్, బర్త్, విద్యాపరమైన, పోలీస్ వెరీఫీకేషన్ పత్రాల నకల్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు తనిఖీల్లో తేలింది.

 

మరిన్ని వార్తలు