రేషన్ ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం

21 Sep, 2015 13:25 IST|Sakshi

నాలుగు నెలలుగా తనకు రేషన్ సరిగా ఇవ్వటం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం జిల్లా ఆగలి మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగేంద్ర(45)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని సోదరి వీరనాగమ్మ చనిపోవటంతో ఆమె ఇద్దరు పిల్లలు కూడా వారితోనే ఉంటున్నారు. అయితే, నాగేంద్ర రేషన్‌కార్డుపై అతని కుటుంబానికి మాత్రమే రేషన్ సరుకులు అందుతున్నాయి. తన చెల్లెలి పిల్లల పోషణ భారం తనపైనే ఉందని, వారికి కూడా రేషన్ ఇవ్వాలని అధికారులను కోరుతున్నా ఫలితం కనిపించడం లేదని.. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు అతనిని అడ్డుకున్నారు. అతని డిమాండ్ మేరకు నాలుగు నెలల రేషన్ సరుకులను ఇచ్చి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పంపించి వేశారు.
 

మరిన్ని వార్తలు