పెంచిన చేతులతోనే విషమిచ్చి..

1 Nov, 2013 02:51 IST|Sakshi

ఓర్వకల్లు(రూరల్), న్యూస్‌లైన్: తీవ్ర తలనొప్పితో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ తన ఐదేళ్ల కూతురితోసహా ఆత్మహత్యకు పాల్పడింది. తాను మరణిస్తే కూతురు దిక్కులేనిదవుతుందని భావించి ఆమె గోరుముద్దలుపెట్టిన చేతులతోనే విషమిచ్చింది. తనతోపాటు మృత్యులోకానికి తీసుకెళ్లింది. ఈ ఘటన గురువారం ఓర్వకల్లు మండలం పాలకొల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. పాలకొల్లు గ్రామానికి చెందిన వడ్డె ఎల్లప్ప, లక్ష్మిదేవి దంపతులు తమ కూతురు రాజేశ్వరి (23)ని బేతంచెర్లకు చెందిన వెంకటరాముడికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒ క కూతురు. ఎలాంటి కలతలు లేకుండా సాఫీగా సాగిపోతున్న తరుణం లో రాజేశ్వరికి తీవ్ర తలనొప్పి సోకింది. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. 6 నెలల క్రితం బేతంచెర్లను వదిలి పాలకొల్లుకు వచ్చి నివాసం ఏర్పా టు చేసుకున్నారు.

ఈ క్రమంలో తలనొ ప్పి మరింత ఎక్కువ కావడంతో గురువా రం తెల్లవారుజామున తన ఐదేళ్ల కూతు రు ఇందుకు థిమెట్ గుళికలు తినిపించి తాను కూడా తిని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరూ మరణించారు. భర్త వెంకటరాముడు పాలీష్ కటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాలుకా సీఐ శ్రీనివాసమూర్తి, ఓర్వకల్లు ఎస్‌ఐ చిరంజీవి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.  తహశీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో వీఆర్‌ఓ చంద్రమౌళీశ్వరరెడ్డి పంచనామా నిర్వహించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా