కిరాతకం

31 Jul, 2015 04:16 IST|Sakshi
కిరాతకం

భార్య, మామను హతమార్చిన యువకుడు
బద్వేలు అర్బన్ :
పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు లో గల వీరభద్రస్వామి దేవాలయం సమీపంలో గురువారం రాత్రి ఓ యువకుడు అతి కిరాతకంగా భార్య, మామలను హతమార్చాడు. వివరాలలోకెళితే పట్టణంలోని వెంకటయ్య నగర్‌లో నివసిస్తున్న పందీటి చెన్నకేశవ సెల్‌పాయింట్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదేవీధిలోని మల్లికార్జున(55) అనే వ్యక్తి కుమార్తె అరుణ(25)ను ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పోరుమామిళ్ల రోడ్డులో కాపు రం పెట్టాడు. అయితే గత కొన్ని నెలలుగా చెన్నకేశవ భార్యను తరచూ వేధిస్తుండడంతో మామ అయిన మల్లికార్జున మందలిస్తుండేవాడని తెలిసింది.

ఈ  నేపథ్యంలో గురువారం కూడా భార్య,భర్తలు ఇరువురు ఘర్షణపడుతుండడంతో విష యం తెలుసుకున్న మల్లికార్జున అక్కడికి వెళ్లి  చెన్నకేశవతో గొడవ పడినట్లు తెలిసింది. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన చెన్నకేశవ కత్తితో మల్లికార్జునను దారుణంగా పొడిచి హతమార్చాడు. అడ్డుకోబోయిన భార్య అరుణను సైతం కత్తితో పొడిచి హతమర్చాడు. గొడవ జరుగుతున్న సమయంలో చెన్నకేశవ స్నేహితుడైన వంశీ అనే యువకుడు అక్కడే ఉండి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. కాగా మృతుడు మల్లికార్జున బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తుండేవాడు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటప్ప పరిశీలించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు