‘సాగర్’లో దూకి యువతి ఆత్మహత్య

5 Aug, 2015 01:52 IST|Sakshi
‘సాగర్’లో దూకి యువతి ఆత్మహత్య

 విజయపురిసౌత్ : సాగర్ జలాశయంలోకి దూకి యువత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే సోమవారం రాత్రి 7గంటలకు జిల్లాలోని రెంటచింతలకు చెందిన భువనం సౌజన్య(24) హడావుడిగా సాగర్‌మాత ఘాట్ మెట్లు దిగుతూ కృష్ణా జలాశయం వద్దకు వెళ్తుండగా అదే సమయంలో ముగ్గురు సాగర్‌మాత భక్తులు జలాశయంలో స్నానం చేసి తిరిగి వస్తున్నారు. సౌజన్యను గమనించిన వారు ఈ సమయంలో నది వద్దకు ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించారు. సౌజన్య ఆగకుండా జలాశయం చూసేందుకు వెళ్తున్నానంటూ వెళ్లిపోయింది. దీంతో సదరు వ్యక్తులు గుడి వద్దకు వచ్చి వాచ్‌మెన్, సెక్యూరిటీ  సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన టార్చ్‌లైట్స్‌ను తీసుకుని జలాశయం ఒడ్డున వెతికినా సౌజన్య జాడ కనిపించలేదు. ఉదయం ఘాట్ సమీపంలో మృతదేహం బయటపడింది.

 నది ఒడ్డున యువతికి సంబంధించిన నల్లటి హ్యాండ్‌బ్యాగ్, లంచ్‌బాక్స్ ఉన్నాయి. అనంతరం మృతదేహం ఎలక్ట్రానిక్ ఛానెళ్లలో రావడంతో గుర్తించిన సౌజన్య బంధువులు విజయపురిసౌత్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అనంతరం సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రిలో సౌజన్య మృతదేహాన్ని గుర్తించారు. సౌజన్య తండ్రి రాయపరెడ్డి రెంటచింతలలో వ్యవసాయం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా సౌజన్య చిన్న కుమార్తె. సౌజన్య హైదరాబాద్‌నీలో ఓ కంపెనీలో  పనిచేస్తోంది. హైదరాబాద్‌లో ఎంబీఏ చదివింది. హైదరాబాద్ నుంచే డెరైక్ట్‌గా సాగర్‌మాత ఘాట్ వద్ద  జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విజయపురిసౌత్ ఎస్సై వై కోటేశ్వరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు