యువతి ఆత్మహత్యాయత్నం

6 May, 2017 03:07 IST|Sakshi

కర్నూలు: రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ వద్ద గన్‌మన్‌గా పని చేస్తున్న ఐసయ్య కూతురు సుచరిత (26) తండ్రి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేసిం ది. ఐసయ్య మాజీ సైనికుడు. కర్నూ లులోని బాలాజీ నగర్‌లో నివాసం ఉంటూ టీజీ వెంకటేష్‌ గన్‌మన్‌గా పని చేస్తున్నాడు.

ఇతని పెద్ద కూతురు  సుచరిత ఎమ్మెసీ బీఈడీ వరకు చదు వుకుంది. ఇటీవల పంచాయతీ కార్య దర్శిపరీక్ష రాసింది. ఇందులో మార్కు లు తక్కువగా వస్తాయని బెంగ పెట్టు కుంది. దీంతో  శుక్రవారం మధ్యా హ్నం తండ్రి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుంది. తండ్రి ఐసయ్య వెంటనే కూతురును ప్రభుత్వ ఆస్పత్రికి తర లించి, ప్రాథమిక చికిత్స చేయిం చారు. మెరుగైన వైద్యం కోసం గౌరి గోపాల్‌ ఆస్పత్రికి తరలించగా.. ఆమె తలకు శస్త్ర చికిత్స చేశారు. కొంత కాలంగా తన కూతురు తలనొప్పితో బాధపడుతుండేదని, ఆ బాధ భరించ లేకనే కాల్చుకొని ఉండొచ్చని తండ్రి ఐసయ్య  ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు