అన్ని పథకాలకు ఆధార్ తప్పనిసరి

20 Aug, 2014 11:57 IST|Sakshi

హైదరాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ మేరకు తెలిపారు. ప్రభుత్వం భారీ మొత్తంలో రాయితీలు అందజేస్తున్న సాంఘిక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు లేదా విశిష్ట గుర్తింపు (యూనిక్ ఐడి) కార్డే ప్రామాణికమని యనమల తెలిపారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులు, స్వయం సహాయక గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో రైతులు తీసుకున్న పంటరుణాలు, బంగారురుణాలపై ఒక కుటుంబానికి లక్షాయాభై వేల రూపాయలు, స్వయం సహాయక గ్రూపులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ జరగనుంది. ఈ ఉత్తర్వులలోని మార్గదర్శక సూత్రాల ప్రకారం రైతులు, డ్వాక్రా గ్రూపులు కచ్చితంగా ఆధార్‌కార్డు పొంది ఉండాలి.

మరిన్ని వార్తలు