మే లోపు ఆధార్ ప్రక్రియ పూర్తి

17 Feb, 2015 06:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రా్రష్ట్ర ప్రజలందరికీ విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య ‘ఆధార్’ జారీ ప్రక్రియను వచ్చే మే నెలలోగా పూర్తి చేస్తామని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండి యా(యూఐడీఏఐ) అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ దేవరతన్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆధార్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై యూఐడీఏఐ డెరైక్టర్ జనరల్ వి.ఎస్.మదన్ సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యద ర్శి రాజీవ్‌శర్మతో చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలతోపాటు ఓటరు గుర్తింపుకార్డుకు కూడా ఆధార్‌ను అనుసంధానించే విషయమై చర్చ జరిగిందని చెప్పారు. త మవద్ద ఉన్న లెక్కల ప్రకారం తెలంగాణలో వందశాతం ఆధార్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు.  
 

మరిన్ని వార్తలు