గ్యాస్ తో ఆధార్ లింక్ తెగింది

30 Jan, 2014 17:54 IST|Sakshi
గ్యాస్ తో ఆధార్ లింక్ తెగింది
నగదు బదిలీ పథకంతో భాగంగా ఆధార్ కార్డుతో ఉన్న సబ్సిడీ వంటగ్యాస్ సిలెండర్ల లింక్ ను తొలగించాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటి నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలోనే  గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది. 
ఆధార్ తో ఉన్న ఎల్ పీజీ సబ్బిడీ బదిలీ పథకాన్ని నిలిపివేశామని  పెట్రోలియ శాఖ మంత్రి ఎమ్ వీరప్ప మెయిలీ తెలిపారు. 
 
మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలు చేసిన వంటగ్యాస్ పై సబ్సిడీని బ్యాంక్ అకౌంట్ల ద్వారా వినియోగదారులకు బదిలీ చేస్తున్న విషయం తెలిపిందే. 18 రాష్ట్రాల్లో 289 జిల్లాల్లో కొనసాగుతున్న ఈ నగదు బదిలీ పథకాన్ని నిలిపివేస్తున్నామని మొయిలీ వివరించారు. అ పథకంపై అనేక ఫిర్యాదులు కమిటీకి అందాయని.. ఆధార్ కార్డు వినియోగం అనేక సమస్యల్ని సృష్టిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో చాలా మందికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు లేకపోవడం అనేక సమస్యలకు కారణమవుతోంది అని మొయిలీ ఓప్రశ్నకు సమాధానమిచ్చారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి పెద్ద ఎత్తున వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరిన్ని వార్తలు