థాంక్యూ సీఎం సార్‌..

11 Jun, 2019 13:14 IST|Sakshi
ఆశ కార్యకర్తలతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నేత మళ్ల విజయప్రసాద్‌

సాక్షి, సీతమ్మధార (విశాఖపట్నం) : మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆశ కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తలకు రూ.3 వేలు నుంచి రూ.10 వేలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఊహించలేదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 60 మంది ఆశ కార్యకర్తలు సోమవారం సీతమ్మధారలోని మళ్ల విజయప్రసాద్‌ క్యాంపు కార్యాలయంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఏ మేరకు హామీలు ఇచ్చారో హామీలు నేరవేరుస్తారనన్నారు. రానున్న వర్షాకాలంలో వైరల్‌ ఫీవర్స్, విష జ్వరాలు సోకే అవకాశాలున్న దృష్ట్యా ఆశ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు