నేడు అబ్దుల్‌ కలాం విద్యా పురస్కారాలు

11 Nov, 2019 05:09 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఒంగోలు టౌన్‌/సాక్షి, అమరావతి : ఈ ఏడాది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం విద్యా పురస్కారాలను అందజేయనున్నట్లు విదాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఒంగోలు సంతపేటలోని తన క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో అక్కడి మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందిస్తారన్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. డీఎల్‌టీ, డైట్‌ వంటి వాటిని టీచర్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లుగా మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా సుశిక్షితులైన ఉపాధ్యాయులను తయారుచేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇఫ్లూ, రీచల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని ఇంగ్లిష్‌ మీడియం బోధించే టీచర్లకు మరింత తర్ఫీదునిస్తామన్నారు.

ఎస్సీ గురుకులాల నుంచి 189 మంది ఎంపిక
ఇదిలా ఉంటే.. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ విద్యా పురస్కారాలకు రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి మొత్తం 189 మంది ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 47 మంది, మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల నుంచి 45 మంది ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వి.రాములు, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్, ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి పి రంజిత్‌బాషా అభినందనలు తెలిపారు.  

14న సీఎం చేతుల మీదుగా నాడు–నేడు కార్యక్రమం
సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాడు–నేడు కార్యక్రమాన్ని ఈనెల 14న ఆయన చేతుల మీదుగా ఒంగోలులో ప్రారంభించనున్నట్లు మంత్రి సురేష్‌ చెప్పారు. అదేరోజు మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సబ్సిడీ రుణాలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు

మార్చికి రెండు హైవే కారిడార్లు పూర్తి 

గురుకులాలకు కొత్త రూపు

పెండింగ్‌ కేసుల దుమ్ముదులపండి 

చల్‌చల్‌ గుర్రం.. తండాకో అశ్వం

బాబు పాలనలో 'కూలి'న బతుకులు

వర్షిత హంతకుడు ఇతడే!

చంద్రబాబు నిర్లక్ష్యం.. నీటి నిల్వకు శాపం

ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం:అవంతి

ఈనాటి ముఖ్యాంశాలు

శివనామ స్మరణలతో మార్మోగిన పున్నమి ఘాట్‌

కళింగపట్నం బీచ్‌లో విషాదం,చివరి సెల్ఫీ

జనవరిలో అటవీశాఖ పోస్టుల భర్తీ

వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం

రన్నింగ్‌లోనే కొల్లగొట్టేస్తారు ! 

క్వారీ.. కొర్రీ

రూ.2 కోసం గొడవ.. ఒకరి దారుణ హత్య

వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల

రైలు దిగే తొందరలో ప్రమాదానికి గురైన దంపతులు

ఇసుక సమస్యకు కాల్‌ సెంటర్‌ : కలెక్టర్‌

'పిల్లలపై ఆంగ్ల బోధనను ఒకేసారి రుద్దం'

సీఎం జగన్‌ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు

కొండవీడు కొండపై మహిళ దారుణ హత్య 

ప్రియుడి భార్యపై దాడిచేసిన రేష్మా

ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌

సుమలత ఆది నుంచి కన్నింగే! 

రెండు నెలల ముందే భీమిలికి సంక్రాంతి 

చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది!

ఆ గ్రామంలో తొలి సంతానానికి ఒకటే పేరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవ్వులు పంచే 90 ఎం.ఎల్‌

అశోక్‌ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే

దర్శకుడు దొరికాడోచ్‌

వాళ‍్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి

‘ఆకాశం నీ హద్దురా!’

అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన