వేధింపులతోనే విద్యార్థుల ఆత్మహత్య

20 Aug, 2015 02:07 IST|Sakshi
వేధింపులతోనే విద్యార్థుల ఆత్మహత్య

కార్పొరేట్ కళాశాలల బంద్ విజయవంతం
నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలి
వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏబీవీపీ డిమాండ్

 
తిరుచానూరు/తిరుపతి క్రైం : కార్పొరేట్ కళాశాలలు పేరుకోసం విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేయడంతోనే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జే. విశ్వనాథ్ అన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలో చేపట్టిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల బంద్ విజయవంతమైంది. విద్యార్థి సం ఘాల నాయకులు జిల్లాలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలను మూ యించి వేశారు. కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించాయి. విద్యార్థి విభాగం నాయకులు తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు. ఉప్పరపల్లి నారాయణ కళాశాల వద్ద మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. హరిప్రసాద్‌రెడ్డి, జే.విశ్వనాథ్ మాట్లాడుతూ చదువు పేరుతో విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు.

కార్పొరేట్ కళాశాలలకు తలొగ్గిన ప్రభుత్వం వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయడం లేదని దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్మకు కారకుడైన మంత్రి నారాయణపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న మనీష, నందిని కుటుం బాలకు రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుం బాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్ విద్యార్థి నాయకులు కిషోర్, హేమంత్‌కుమార్‌రెడ్డి, మౌలాలి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు నరేష్, శివారెడ్డి, చాముతి, దాము, చలపతి పాల్గొన్నారు.
 
13మందిపై కేసు నమోదు..

బంద్‌లో భాగంగా కాలేజీలపై దాడులకు పాల్పడిన 13మంది విద్యార్థి సంఘ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎంఆర్‌పల్లి ఎస్‌ఐ ఆదినారాయణ తెలిపారు. వీరు తిరుపతి ఎమ్మార్ పల్లి పరిధిలోని నారాయణ మెడికల్ జూని యర్ కళాశాలలో అద్దాలు పగులగొట్టారని, కుర్చీలు విరగ్గొట్టారని, కళాశాల ఇన్‌చార్జ్ ఫిర్యాదు మేరకు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
 
 
 

>
మరిన్ని వార్తలు